28న ఐసర్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

28న ఐసర్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

28న ఐ

28న ఐసర్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఏర్పేడు: తిరుపతి ఐసర్‌లో ఈనెల 28వ తేదీన జాతీయ సైన్స్‌ దినోత్సవం వేడుకగా నిర్వహించనున్నట్లు ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శాంతను భట్టాచార్య తెలిపారు. ఈనెల 28వ తేదీన, అలాగే మార్చి 2వ తేదీన ఈ వేడుకను మెగా–స్కేల్‌ సైనన్స్‌ ఔట్రీచ్‌ ఫెస్టివల్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 కంటే ఎక్కువ ఇంటరాక్టివ్‌ కార్యకలాపాలు, ప్రదర్శనలు, ఆచరణా త్మక ప్రయోగాలతో ఈ సైన్స్‌ దినోత్సవ కార్యక్రమాలు నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యకలాపాలు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భూమి, వాతావరణ శాస్త్రాలు, కంప్యూటర్‌ సైన్‌న్స్‌ వంటి విభాగాల్లో ప్రయోగ ప్రదర్శనలుంటాయన్నారు. అలాగే మార్చి 2వేదీ సోమవారం ప్రముఖ వక్తల ప్రత్యేక ప్రసంగాలుంటాయని, వాటిలో బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కౌస్తవ్‌ సన్యాల్‌, బాంబే ఐఐటీ కెమిస్ట్రీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ రుచి ఆనంద్‌, రిటైర్డ్‌ సర్జన్‌, సైన్స్‌ కమ్యూనికేటర్‌ ప్రొఫెసర్‌ ధనంజయ శర్మ ప్రసంగాలు వాటిలో ప్రధానమైనవన్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,803 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

శ్రీకాళహస్తీశ్వరాలయ

ఈఓ బదిలీ

– నూతన ఈఓగా వెంకటేశులు

శ్రీకాళహస్తి: ముక్కంటి ఆలయ ఈఓగా పనిచేస్తున్న బాపిరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రెవెన్యూశాఖ నుంచి ఎండోమెంట్‌కు డిప్యూటేషన్‌పై 2024 నవంబరు 2వ తేదీ శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓగా చేరిన ఆయనకు గత సంవత్సరం నవంబర్‌తో ఏడాది డిప్యూటేషన్‌ ముగిసింది. జూన్‌ 30వ తేదీన ఉద్యోగ విరమణ వరకు శ్రీకాళహస్తీవ్వరాలయ ఈఓగా కొనసాగనున్నట్లు దేవాదాయశాఖ నుంచి అనుమతి వచ్చింది. ఆలయ చైర్మన్‌గా కొట్టేసాయిప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈఓకు, ఆయనకు మధ్య జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ బదిలీ జరిగినట్లు ఊహా గానాలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలు ముందగానే బదిలీ కావడంతో చైర్మన్‌ చక్రం తిప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శివరాత్రి ముందే ఈఓను మార్చమని అధిష్టానాన్ని సంప్రదించిన చైర్మన్‌కు ఉత్సవాల తరువాత మారుస్తామని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈఓ బాపిరెడ్డి బదిలీ అయివుండవచ్చని అనుకుంటున్నారు. సీఆర్‌డీఏ ఎస్‌డీసీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఈఓగా ముద్దనూరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌డీసీగా పనిచేస్తున్న బీకే వెంకటేశులు శ్రీకాళహస్తి ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎండోమెంట్‌నుంచి ఆర్డరు రావాల్సి ఉంది.

సంతృప్తికర సమాధానం ఇవ్వండి

తిరుపతి అర్బన్‌: ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది..గడువులోపు అర్జీదారులకు సంతృప్తికర సమాధానం ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం తప్పకుండా మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎవరి పరిధిలో వారు తప్పకుండా హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, డీడీఓ నారాయణరెడ్డి, డీఎస్‌డబ్ల్యూఎస్‌ కోఆర్డినేటర్‌ జగదీష్‌, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ ఆనందమూర్తి, పశుసంవర్థకశాఖ జేడీ రవికుమార్‌, ఆర్టీఓ మురళీమోహన్‌, డీఎస్‌ఓ శేషాచలం రాజు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ అరుణ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, అగ్రికల్చర్‌ జేడీ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

28న ఐసర్‌లో  జాతీయ సైన్స్‌ దినోత్సవం 
1
1/1

28న ఐసర్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement