పది పరీక్షలకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

పది పరీక్షలకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి

పది పరీక్షలకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి

తిరుపతి అర్బన్‌: పది పరీక్షలు సమర్థవంతంగా నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పరీక్ష కేంద్రాలను పోలీసులు ముందే పరిశీలించాలని స్పష్టం చేశారు. అలాగే డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ ఇప్పటి నుంచే అప్రమ్తతంగా వ్యవహరించాలన్నారు. ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. పరీక్ష పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్‌ అధికారులు, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ కేవీఎన్‌ కుమార్‌, విద్యాశాఖ సహాయ కమిషనర్‌ సుధా, తిరుపతి మున్సిపల్‌ అడిషనల్‌ కమిషనర్‌ శారదాదేవి, డీపీఓ సుశీలాదేవి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌, రవాణా శాఖ అధికారి మురళీమోహన్‌, కోశాధికారి మృదుల, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement