8న ఎస్వీయూలో జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

8న ఎస్వీయూలో జాబ్‌ మేళా

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

8న ఎస్వీయూలో జాబ్‌ మేళా

8న ఎస్వీయూలో జాబ్‌ మేళా

● రెవెన్యూ క్లినిక్‌ శిబిరాల నిర్వహణ ● 8న చంద్రగిరి నియోజకర్గానికి కలెక్టరేట్‌లో క్లినిక్‌

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఈనెల 8వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పలు ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌ మేళా కు హాజరవుతారని, ఆసక్తిగల ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ, పలు ఫార్మశీ కో ర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

ఉపాధిహామీ పేరు మార్పు పోస్టర్‌ ఆవిష్కరణ

తిరుపతి అర్బన్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ పథకం పేరును జీ రామ్‌ జీ గా పేరు మార్పు చేసిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డ్వామా పీడీ శ్రీనివాస ప్ర సాద్‌ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పీఎం మన్మోహన్‌ సింగ్‌ పాలనలో పెట్టిన పేరును 20 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వంలో పీఎం నరేంద్రమోదీ ఆ పేరును మార్పు చేశారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివా రం అర్ధరాత్రి వరకు 85,179 మంది స్వామివారి ని దర్శించుకున్నారు. 18,831 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శ నం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారి ని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

25న తిరుచానూరులో రథసప్తమి

చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నట్లు పే ర్కొన్నారు. కాగా సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు పద్మావతీ అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో అ మ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్‌ దర్శనం, ఊంజల సేవ, వేదాశీర్వచనం తదితర సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 20వ తేదీ అమ్మవారి ఆలయంలో ఉదయం 6.30 నుంచి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారని తెలిపారు.

ఒక్కో నియోజకవర్గం ఒక్కో రోజు

తిరుపతి అర్బన్‌: ఒక్కొక్క నియోజకవర్గానికి ఒ క్కొక్క రోజు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ శిబిరాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సోమవా రం తెలిపారు. ముందుగా జిల్లాలో ఈ నెల 8వ తేదీ(గురువారం) చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ శిబిరం ఉంటుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలకు చెందిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ నిర్వహి స్తున్నామని వెల్లడించారు. అలాగే వారానికి ఒక్క నియోజకవర్గం చొప్పున అన్నీ నియోజకవర్గాకు రెవెన్యూ క్లినిక్‌ శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గానికి నిర్వహిస్తామన్న సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి కలెక్టరేట్‌లోనే చెప్పిన తేదీల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయా మండల తహసీల్దా ర్లు, వీఆర్వోలు హాజరుకావాలని చెప్పారు. అలా గే కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులు పా ల్గొంటారని తెలిపారు. అయితే కేవలం రెవెన్యూ సమస్యలపై మాత్రమే అర్జీలు స్వీకరణ, సమస్యల పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement