మీ ప్రాణాలకు రక్షణ
ద్విచక్రవాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించండి. అది మీ ప్రాణాలకు రక్షగా ఉంటుంది. తలజుట్టు ఊడిపోతుందన్న ఫ్యాషన్‌కు పోయి తలకు హెల్మెట్ ధరించడం గిల్టీగా ఫీలువుతున్నారు. దాంతో అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ వినియోగంపై రవాణా, పోలీసుశాఖ అధికారులు వాహనచోదకులకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనచోదకుల్లో చలనం రాకపోవడం భాదాకరం. ఇప్పటికై నా వాహనదారులు హెల్మెట్‌ను ధరించి ప్రాణాలను కాపాడుకోండి. – కొర్రపాటి మురళీమోహన్,
తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి


