గజ..గజ..! | - | Sakshi
Sakshi News home page

గజ..గజ..!

Dec 14 2025 12:15 PM | Updated on Dec 14 2025 12:15 PM

గజ..గజ..!

గజ..గజ..!

● 17 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత ● చలికి వణికిపోతున్న ప్రజలు ● వాతావరణంలో మార్పులే కారణమంటున్న నిపుణులు

వామ్మో..చలి

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు.. చల్లగాలులు.. పొద్దుపోతే మంచు ప్రభావం.. అర్ధరాత్రి దాటాక ఆవరిస్తున్న పొగమంచు.. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వెరసి జిల్లావాసులు గజగజ వణుకుతున్నారు.

తిరుపతి తుడా:చలి పంజా విసురుతోంది. చలి తీవ్ర తకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జిల్లాలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మంచు తీవ్రత రోజు రో జుకు పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకే మొ దలవుతున్న చలి ప్రభావం మరుసటి రోజు ఉద యం 9 గంటల వరకు కనిపిస్తోంది. ఉదయం 6 గంటల వరకు చలి మరీ ఎక్కువగా ఉంటోంది. రాబోవు రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో మార్పులతో..

ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో మార్పు లు చోటు చేసుకోవడంతో చలి తీవ్రత పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది అత్యంత కనిష్టంగా ఇప్పటివర కు 17 డిగ్రీలు దిగిపోవడం చలి తీవ్రతను స్పష్టం చే స్తోంది. డిసెంబర్‌ చివరి, జనవరి మొదటి వారాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది.

పెరిగిన గిరాకీ

చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, శాలువలు, మంకీ క్యాప్‌లు, ఇతర రక్షణ దుస్తులకు గిరాకీ పెరుగుతోంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అవసరం రావడంతో వ్యాపారులు సామాన్యుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ధరలను అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు.

వణికి పోతున్న ప్రజానీకం

చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం జిల్లాపై తీ వ్రంగా కనిపిస్తోంది. మన్యం జిల్లాలను తలపించేలా గ్రామీణ ప్రాంతాల్లో మంచు కురు స్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కమ్మేస్తున్న మంచు

మంచు పల్లెల్ని కమ్మేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా మంచు గుప్పెట్లోకి జిల్లా వెళ్లిపో యింది. ముఖ్యంగా తిరుమలలో చలి మంచు తీవ్ర త అధికంగా ఉంది. పాలు, కూరగాయల వ్యాపారు లు, రైతులు మంచులో తడిసి ముద్దవుతున్నారు. మంచు కారణంగా చిరువ్యాపారులు, రైతుల రోజు వారి దినచర్య సమస్యగా మారింది. మంచు కా రణంగా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా రు. ఉదయం 7 గంటల వరకు లైట్లు వెలుతురుతో నే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement