
కూటమి వంచనలు చూడలేకే వైఎస్సార్‌సీపీలో చేరిక
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించడాన్ని చూడలేక వైఎస్సార్‌సీపీలో చేరామని టీడీపీ నాయకులు రాజేంద్రరాయల్, పురుషోత్తంనాయుడు పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం తిరుపతి 33వ డివిజన్‌కు చెందిన టీడీపీ అధ్యక్షులు రాజేంద్రరాయల్, పురుషోత్తం నాయుడుతోపాటు 50 మందికి పైగా వారి అనుచురులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందని ఎంతో ఆశించామన్నారు. అయితే కూటమిలో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని, ప్రజాసమస్యల పరిష్కారాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. తాము టీడీపీ నాయకులుగా వార్డుల్లో తిరగాలంటే ముఖం చెల్లడంలేదన్నారు. చంద్రబాబు అధికారం కోసం మోసపూరిత వాగ్దానాలు చేసి, ప్రజలను ఇంతగా మోసగిస్తారనుకోలేదన్నారు. ఏడాదన్న కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని చెప్పారు. గతంలో ఏ రాజకీయపార్టీకి ఇంతగా వ్యతిరేకత రాలేదని, అలాంటి టీడీపీలో ఉంటే ప్రజలతో ఛీ కొట్టించుకోవడం తప్ప ప్రజల మన్ననపొందలేమన్నారు. ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనన్నారు. జగనన్న లాంటి నాయకుడే రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డిలు చేసిన అభివృద్ధి గత 40ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సాకం ప్రభాకర్, పోలిరెడ్డి నాగిరెడ్డి, సయ్యద్ షఫీ, అహ్మద్‌ఖాదరీ, లవ్లీ వెంకటే ష్, గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్‌సెల్ జిల్లా అధ్యక్షులు మద్దాలి శేఖర్, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు రమణారెడ్డి, పార్టీ నాయకులు పడమటి కుమార్, వెంకటేష్‌రాయల్, సుధాకర్, పద్మజ, విజయలక్ష్మి, రాధ, ఉష తదితరులు పాల్గొన్నారు.