
ఎస్‌ఏ తెలుగులో జిల్లా ఫస్ట్ విజయ్
సత్యవేడు: డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి సత్యవేడు మండలం నీలితొట్టికండ్రిగకు చెందిన ఎస్.విజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 87.01907 మార్కులతో జిల్లాస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. అలాగే టీజీటీలోనూ 80.70 మార్కులతో జోనల్ స్థాయి నాలుగో ర్యాంకు పొందారు.
డిగ్రీ దరఖాస్తులకు
రేపే ఆఖరి గడువు
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పలు డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికి వరకు జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలో 21 విభాగాలకు సంబంధించి సుమారు 23వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
టీచర్లకు ఇంగ్లిష్ స్కిల్స్‌పై శిక్షణ
తిరుపతి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్న నేపథ్యంలో టీచర్లకు ఆంగ్లంపై పూర్తి పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముందని విల్ టూ కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (హైదరాబాద్) సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ తెలిపారు. ఆదివారం తిరుచానూరు జెడ్పీ హైస్కూల్లో 100 మంది టీచర్లకు ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ ఇచ్చారు. గౌడ్ మాట్లాడుతూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డీఈఓ కేవీఎన్ కుమార్, సమగ్రశిక్ష అడిషన్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ గౌరీశంకర్‌రావు మాట్లాడుతూ ఇంగ్లిష్‌లో మెలకువలను నేర్చుకుంటే విద్యార్థులకు చక్కగా బోధించవచ్చని సూచించారు. సెక్టోరియల్ అధికారులు సారథి, చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు.

ఎస్‌ఏ తెలుగులో జిల్లా ఫస్ట్ విజయ్