
సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్లు అందగానే సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఇందుకు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. పరిశీలనకు హాజరయ్యే బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియకు చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉండే అపోలో యూనివర్సిటీ, ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలను పరిశీలన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన 1,478 అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఆయా అభ్యర్థులకు కాల్‌లెటర్‌లో సూచించే తేదీలు, సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు.