
ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్సులిన్ కొరత
ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు టైప్–1 డయాబెటీస్‌కు ఇన్సులిన్ ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో అరకొరగా ఇన్సులిన్ అందిస్తున్నారు. మండల కేంద్రాలలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలోనూ ఇన్సులిన్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో వ్యయ ప్రయాసల కోర్చి బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పట్టణ ప్రాంతాలలోని ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు సుమారు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నెలకు సుమారు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ఖర్చు అవుతోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ వేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్ కంటే రెండు రెట్లు అధికంగా ఉంటుంది.