
నేడు గ్రామ సర్వేయర్ల డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
తిరుపతి అర్బన్ : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ సర్వేయర్ల పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆయన శనివారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం తిరుపతి నగరంలో 3 పరీక్షా కేంద్రాల్లో 1450 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ లైజన్ అధికారిగా ఉంటారని చెప్పారు. పరీక్షలు తిరుపతిలోని వెస్ట్ చర్చి రోడ్డు, బాలాజీ కాలనీలోని శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల (405) , శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల (వింగ్–ఏ)(406, శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల(వింగ్–ఏ)(407) నందు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ టీఎస్ రాజ్‌గోపాల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు జగదీష్, యోగేష్ పాల్గొన్నారు.
డీఎస్సీ హిందీ పండిట్‌లో జిల్లా టాప్
రాపూరు : డీఎస్సీ–25 ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో రాపూరు పంచాయతీ నవాబుపేటకు చెందిన విద్యార్థిని సయ్యద్ షబనాజ్ నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానం సాధించింది. ఉపాధ్యాయుల నియామకం కోసం చేపట్టిన డీఎస్సీ–25లో రాపూరు మసీదుపేటకు చెందిన సయ్యద్ సిరాజ్‌అహ్మద్, సయ్యద్ నర్తాజ్ కుమార్తె అయిన షబనాజ్ 84.65 మార్కులు సాధించి నెల్లూరు జిల్లాలో ప్రథమ స్ధానం సాధించింది.
డీఎస్సీలో మెరిసిన పేదింటి కుసుమాలు
చిట్టమూరు: మండలానికి చెందిన పేదింటికి చెందిన ఇద్దరు యువకులు డీఎస్సీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. చిట్టమూరు మండలం కోగిలి పంచాయతీలోని గొల్లపాళెంకు చెందిన రాయి సాయి కోటి అనే యువకుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్సీ–25 పరీక్షకు హాజరయ్యాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 93 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.
ఎస్‌ఏ తెలుగులో మొదటి ర్యాంకు
చిట్టమూరు మండలం యల్లసిరి దళితవాడకు చెందిన మైలారీ శ్రీకాంత్ 2025 డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యాడు. రాష్ట్ర స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. పేదింటి పిల్లలు రాష్ట్ర స్థాయిలో రెండు విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించడంతో చిట్టమూరు మండలానికి గుర్తింపు తీసుకొచ్చారు.
ఒకేసారి 5 టీచర్ ఉద్యోగాలు
ఎర్రవారిపాళెం(చంద్రగిరి):మెగా డీఎస్సీ ఫలితా ల్లో ఎర్రవారిపాళెం మండలానికి చెందిన యువకుడు సత్తా చాటాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ఎర్రవారిపాళెం మండలం ఓస్ గొల్లపల్లికి చెందిన ముండ్రే శేషాద్రి డీఎస్సీ పరీక్షలను రాశారు. అయితే శుక్రవారం వచ్చిన ఫలితాల్లో ఎస్‌ఏ సోషియల్‌లో 5.63 మార్కులతో 9వ ర్యాంకు, ఎస్‌జీటీలో 86.33 మార్కులతో 53వ ర్యాంకు, ఎస్‌ఏ తెలుగులో 73.05 మార్కులతో 42వ ర్యాంకు, టీజీటీ తెలుగులో 71.00 మార్కులతో 127వ ర్యాంకు, టీజీటీ సోషియల్‌లో 70.93 మార్కు లతో 82వ ర్యాంకు సాధించి 5 ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ఒకేసారి వెలువడిన ఫలితాల్లో అద్భుత విజయం సాధించిన శేషాద్రిను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.
తిమ్మనాయుడుపాళెం యువకుడికి
3 ఉద్యోగాలు..
కోట:మండలంలోని తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాఽథ్ డీఎస్సీ పరీక్ష పలితాల్లో మూడు ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. పీజీటీ సోషల్ జోన్– 3లో 22వ ర్యాంక్, ఎస్‌ఏ సోషల్ నెల్లూరు జిల్లాలో 23వ ర్యాంక్, టీజీటీ సోషల్ జోన్ 3లో 59వ ర్యాంక్ సాధించాడు. తల్లిదండ్రులు నరసయ్య, రమణమ్మ వ్యవసాయ కూలీలు. ప్రస్తుతం రైల్వేలో ట్రాక్ మెయింటనర్‌గా దొరవారిసత్రంలో పనిచేస్తున్నాడు.

నేడు గ్రామ సర్వేయర్ల డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

నేడు గ్రామ సర్వేయర్ల డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

నేడు గ్రామ సర్వేయర్ల డిపార్ట్‌మెంటల్ పరీక్షలు