
దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ
– 8లో
– 8లో
సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలి
సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలని శనివారం చిట్టమూరు మండలంలోని సోమసముద్రం గ్రామస్తులు నిరసన చేపట్టారు.
తిరుపతి మంగళం : గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా దివ్యాంగులకు వస్తున్న పింఛన్లు తొలగించి వారిని మరింతగా బాధపెడుతున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దివ్యాంగుల పెన్షన్లను తొలగించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడింది. రెండు రోజుల కిందట తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద దివ్యాంగులు చేపట్టిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మద్దతు తెలిపి ధర్నా చేపట్టారు. శనివారం తిరుపతి నగరంలోని 50 డివిజన్‌లలో సచివాలయ సెక్రటరీలకు పింఛన్లు పునరుద్ధరించాలంటూ భూమన అభినయ్‌రెడ్డితో పాటు ఆయా వార్డు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు వినతిపత్రాలను సమర్పించారు. తిరుపతి 3వ డివిజన్‌లో భూమన అభినయ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తెలుసుకుని దివ్యాంగుల పెన్షన్లను తిరిగీ పునరుద్ధరించాలని భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో సుమారు 7,425 పింఛన్లు తొలగించారని, తిరుపతి నగరంలో 436 పెన్షన్లను తొలగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకుండా దివ్యాంగులకు వస్తున్న పెన్షన్లను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. రద్దు చేసిన పింఛన్‌లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.