
బంగారు తిరుచ్చిపై శ్రీవారి పట్టపురాణి
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై భక్తులను అనుగ్రహించారు. తొలుత శుక్రవారం తెల్లవారిజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వజ్ర వైఢూర్యాలతో శోభాయమానంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత ఆలయ శ్రీకృష్ణ ముఖ మండపం వద్ద కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉయ్యాలసేవలో స్వామి అమ్మవార్లు సేదదీరారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.