తక్షణమే రోడ్డు నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణమే రోడ్డు నిర్మించాలి

Aug 18 2025 6:21 AM | Updated on Aug 18 2025 6:21 AM

తక్షణ

తక్షణమే రోడ్డు నిర్మించాలి

అధ్వాన్నంగా నాగలాపురం– చిన్నపాండూరు మార్గం గ్రామీణుల అవస్థలు వర్ణనాతీతం వాహనదారులకు నిత్యం నరకం పట్టించుకోని కూటమి ప్రభుత్వం స్పందించని అధికార యంత్రాంగం

నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డు దుస్థితిని మాటల్లో చెప్పలేం. రాకపోకలకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. తక్షణమే రోడ్డు నిర్మించాలి. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపాలి. – దానివేలు, బీరకుప్పం

నిధులు మంజూరు చేయాలి

రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం అధికారులు కృషి చేయాలి. – ఈశ్వర్‌, కడివేడు

లారీల తాకిడికి ధ్వంసం

చిన్నపాండూరుకు వెళ్లే రోడ్డు పొడవునా బావులను తలపించే గుంతలు ఉన్నాయి. ప్రధానంగా చమర్తకండ్రిగ వరకు కంకర లారీల తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – మురళీరెడ్డి, సిద్ధాపురం

వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం నుంచి టీపీకోట మీదుగా చిన్న పాండూరుకు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. కఈ మార్గంలో పలుచోట్ల మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. ఒకప్పుడు తారురోడ్డుగా ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. దీంతో ప్రజలు రాకపోకలకు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమే. రోడ్డు పొడవునా బావులను తలపించేలా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బస్సులు, కార్లు, లారీలు సైతం ఆ మార్గంలో వెళ్లడం కష్టతరంగా మారింది. ఇక ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితిలో సుమారు 20 గ్రామాలకు పైగా ప్రజల రాకపోకలకు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.

రూ. 71కోట్లతో ప్రతిపాదనలు

నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డుఅభివద్ధి కోసం రూ. 71కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలను భుత్వానికి నివేదించారు. అయితే నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం గమనార్హం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 19 కిలోమీటర్ల మేర రోడ్డు అభివద్ధి కోసం రూ. 49కోట్లు మంజూరు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంచాన వ్యయం పెంచి రూ. 71కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పాదిరికుప్పం వద్ద ..

మట్టి రోడ్డును తలపిస్తూ..

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
1
1/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
2
2/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
3
3/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
4
4/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
5
5/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
6
6/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

తక్షణమే రోడ్డు నిర్మించాలి 
7
7/7

తక్షణమే రోడ్డు నిర్మించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement