హథీరాంజీ మఠం భూమి కబ్జాకు యత్నం
తిరుపతి కల్చరల్: ఎయిర్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని హథీరాంజీ మఠానికి చెందిన 7 సెంట్ల భూమిని పక్కనే ఉన్న ఓ షోరూం వారు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి నగర పరిధిలోని సర్వే నం.266/3ఏలో హథీరాంజీ మఠానికి చెందిన 7 సెంట్ల భూమి ఉంది. ఈ స్థలానికి వెనుక పక్కనున్న షోరూం వారు కూటమి నేతల సహకారంతో కబ్జా చేసేందుకు గతంలో ప్రయత్నం చేశారు. అప్పట్లో హథీరాంజీ మఠం అధికారులు అడ్డుకొని ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే ఇటీవల ప్రహరీ గోడను కూల్చివేయడంతో తిరిగి హథీరాంజీ మఠం అధికారులు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం సదరు మఠం స్థలంలో నిర్మాణాలకు పూనుకోవడంతో.. విషయం తెలుసుకున్న మఠం అధికారులు కబ్జాదారులను అడ్డుకున్నారు. అయితే కూటమి నేతల ఒత్తిడితో మఠం అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం.
తాగునీటి సమస్యకు
24 గంటల్లో పరిష్కారం
తిరుపతి అర్బన్: పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి ట్యాంకర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
హథీరాంజీ మఠం భూమి కబ్జాకు యత్నం


