రెండోరోజు ముగిసిన వైఎస్‌ షర్మిల పాదయాత్ర

YSRTP Chief YS Sharmila 2nd Day Of Padayatra Completed - Sakshi

సాక్షి, రంగారెడ్డి: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top