11 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం  | YSR Telangana Party Chief YS Sharmila Praja Prasthanam Begins From March 11 | Sakshi
Sakshi News home page

11 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం 

Mar 6 2022 4:06 AM | Updated on Mar 6 2022 8:26 AM

YSR Telangana Party Chief YS Sharmila Praja Prasthanam Begins From March 11 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 11 నుంచి పునః ప్రారంభమవుతుందని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన లోటస్‌పాండ్‌ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌ 20న ప్రారంభించిన షర్మిల పాదయాత్రకు ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్‌ కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడిందన్నారు.

పాద యాత్రను ప్రారంభించకుండా ప్రభుత్వం పలు ఆంక్షలతో అడ్డుకుందని ఆరోపించారు. గత పాదయాత్రలో 21 రోజుల్లోనే 231 కిలోమీటర్లు, 5 మున్సిపాలిటీలు, 15 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేశారని తెలిపారు. 11న నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు చెప్పారు.  ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగదీక్ష కొనసాగుతుందని దేవేందర్‌రెడ్డి వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement