దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

YS Vivekananda Reddy Case: YS Bhaskar Reddy Petition TS High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఆదేశించినట్లుగా ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని, దాని ఆధారంగా కేసుతో ఎలాంటి సంబంధంలేని వారిని ఇరికించాలని దర్యాప్తు సంస్థ ప్రయతి్నస్తోందని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధమని, అతడికి బెయిల్‌ ఇచ్చే సమయంలో కిందికోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దస్తగిరి చెప్పిన వివరాల అధారంగా తనతోపాటు మరి కొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు.

‘దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, బెయిల్‌ ఇస్తూ కిందికోర్టు ఇచి్చన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలు ఇవ్వాలి’అని అభ్యరి్థస్తూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌లోనూ వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ అయ్యారు. ‘దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. హత్యకు ఆయుధాన్ని కొనుగోలు చేసింది అతడే. దస్తగిరికి బెయిల్‌ ఇచ్చేందుకు సీబీఐ పూర్తిగా సహకరించింది. దస్తగిరిపై వాచ్‌మన్‌ రంగన్న చెప్పిన అంశాలను కిందికోర్టు పట్టించుకోలేదు’అని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌లో మరికొన్ని అంశాలివీ.. 

అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చా..
నా వయసు సుమారు 73 ఏళ్లు. దీర్ఘకాలిక వెన్నునొప్పి, ఛాతీలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నా. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరయ్యా. దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. సీఆర్‌పీసీ సెక్షన్‌ 161, 164 కింద వివేకా వాచ్‌మన్‌ రంగన్న స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు సంస్థ రికార్డ్‌ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్‌ పడిపోవడం వంటి శబ్దాలు వినపడటంతో లేచి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. లోపలి నుంచి ఏడుపు లాంటి శబ్దం వినిపించడంతో పార్క్‌ వైపు ఉన్న ద్వారం వద్దకు వెళ్లి పక్కనే ఉన్న కిటికీ లోంచి లోపలికి చూశాడు.

ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వాళ్లు హాల్‌లో ఏదో వెతుకుతూ కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌గా గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్‌ వైపు ద్వారం తెరిచి సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్‌ హడావుడిగా వచ్చి కాంపౌండ్‌ వాల్‌ దూకి పారిపోయారు. అక్కడ దొరికిన ఆధారాల మేరకే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. 

మమ్మల్ని ఇరికించే ప్రయత్నం.. 
ఆ నలుగురే ఈ హత్య చేసినట్లు రంగన్న స్టేట్‌మెంట్‌ చాలా స్పష్టంగా చెబుతున్నా ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేని నాతోపాటు మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఇరికించేందుకు దర్యాప్తు సంస్థ అక్రమ పద్ధతులను అనుసరిస్తోంది. వివేకా కుమార్తె సునీత, దర్యాప్తు అధికారులు వారికి తోచిన చట్టవిరుద్ధ ప్రక్రియలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే దస్తగిరికి కొన్ని సూచనలు చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో దస్తగిరి.. ఏ–5(శివశంకర్‌రెడ్డి)తో పాటు నాపై, మరో ఇద్దరిపై నిరాధార ఆరోపణలు చేశాడు.  

సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోకుండా..
మరో ఇద్దరికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దస్తగిరి గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా ఆధారంగా చేసుకుని సీబీఐ నాపై ఆరోపణలు మోపుతోంది. నాకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అనుసరించిన విధానం పూర్తిగా చట్టవిరుద్ధం. హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. దస్తగిరి చెప్పిన దానికి ఎలాంటి సాక్ష్యం లేదు. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీ

రిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా కీలక పాత్ర పోషించిన దస్తగిరికి మాత్రం బెయిల్‌ ఇవ్వడం సరికాదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. ఆయుధాన్ని తెచ్చానని, హత్యలో ప్రధాన పాత్ర పోషించానని కూడా ఒప్పుకున్నాడు. ఈ అంశాన్ని కిందికోర్టు మేజిస్ట్రేట్‌ పరిగణలోకి తీసుకోలేదు. బెయిల్‌ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. అప్రూవర్‌గా మారడం, బెయిల్‌ ఇవ్వ డం అంతా చట్టవిరుద్ధంగానే జరిగింది. బెయిల్‌ మంజూరు చేస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా నన్ను నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి.
చదవండి: ‘స్కిల్‌’ సూత్రధారి బాబే 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top