
ఉప్పల్/రామంతాపూర్: బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఫలహారం బండి ఉరేగింపులో కొందరు ఆకతాయిలు బందోబస్తులో ఉన్న ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్ భరత్ నగర్‌కు చెందిన రామరాజు ఆదివారం రాత్రి ఫలహారం బండి ఉరేగింపు కార్యకమాన్ని నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఆ కారులో అనిల్, క్రాంతి ఉన్నారు.
క్రాంతి మద్యం మత్తులో ఉండటంతో అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన అనిల్ తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చి వాహనాన్ని, క్రాంతిని ఎందుకు తీసుకెళ్లారని ప్రశి్నస్తూ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి కర్రలు ,రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎస్‌ఐ మధు, హెడ్‌కానిస్టేబుల్ సురేష, కానిస్టేబుల్ లఖన్‌కు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని హబ్సిగూడకు చెందిన మామిడాల అనిల్, మేడిపల్లికి చెందిన లక్ష్మణ్, రామంతాపూర్‌కు చెందిన రామరాజు, సాయిగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న కొందరు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో ఎస్‌ఐతో వాగ్వాదం
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్టు
బంజారాహిల్స్: బోనాల వేడుకలు ముగిసిన అనంతరం ఎక్కడి వారిని అక్కడ పంపిస్తుండగా ఎస్‌ఐని దూషించడమేగాక కానిస్టేబుల్ ఫోన్ ధ్వంసం చేసి న్యూసెన్స్‌కు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్ బస్తీలో పోచమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న సెక్టార్ ఎస్‌ఐ విజయ్, కానిస్టేబుల్ రాజ్‌కుమార్ అక్కడ గుమిగూడిన వారిని ఇళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో అదే బస్తీకి చెందిన రాకేష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్నేహితుడు అరుణ్‌తో కలిసి ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ఎస్‌ఐ విజయ్ వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పాడు.
మద్యం మత్తులో ఉన్న రాకేష్ తాము ఇక్కడ ఉంటే మీకు ఏమంటూ దురుసుగా ప్రవర్తించాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ న్యూసెన్స్ చేయడమేగాక అక్కడే బైఠాయించాడు. అతడిని పైకి లేపడానికి యతి్నస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ రాజ్‌కుమార్ ఫోన్ కిందపడి ధ్వంసమైంది. దీంతో పోలీసులు రాకే‹Ùపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.