
జనగాం: ప్రేమ విఫలమై తొర్రూరులోని చర్చి బజారుకు చెందిన అల్లం శ్యామ్ (26) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలోని ఓ యువతిని ప్రేమించాడు.
ఆమె తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి పస్తం స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.