అనుమానాస్పద స్థితిలో నర్స్‌ మృతి | Young woman Ends Life In Suspicious condition | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో నర్స్‌ మృతి

Published Sat, Apr 26 2025 11:29 AM | Last Updated on Sat, Apr 26 2025 11:29 AM

Young woman Ends Life In Suspicious condition

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. 

అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి  ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్‌ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్‌ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement