హైదరాబాద్ నుంచి పారిపోయి కర్ణాటకలో సహజీవనం

Young boy arrested who made pregnant Girl - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన ఓ మైనర్‌ బాలుడిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలుడు(17), బాలిక (16) మే నెలలో తమ తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకలో వారు ఉన్నట్లు గుర్తించారు. కాగా బాలిక అప్పటికే నాలుగు మాసాల గర్భవతి. బాధ్యుడైన మైనర్‌ బాలుడిపై పోక్సో యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌)

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top