
భువనగిరి టౌన్: ‘హలో నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. గతంలో మీ స్కూల్‌లో చదువుకున్న అక్షయ అనే విద్యార్థికి గంటలోపు సర్టిఫికెట్స్ ఇవ్వాలి’ అని కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సాధన హైసూ్కల్ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి ఆదేశించారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడేనికి చెందిన రావుల అక్షయ సాధన ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకుంది. 9వ తరగతి బస్వాపురం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో చేరింది.
ప్రస్తుతం అక్షయ పదో తరగతి చదువుతోంది. అక్షయ రెండేళ్లుగా ప్రైవేట్ స్కూల్ చుట్టూ తిరుగుతోంది. మొత్తం ఫీజు చెల్లిస్తే తప్ప సరి్టఫికెట్లు ఇవ్వబోమని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థిని తల్లి రూ.10 వేలు చెల్లించింది. ఈ మొత్తాన్ని యాజమాన్యం బుక్స్, యూనిఫామ్ కింద జమ చేసుకుని, ఫీజు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో గత్యంతరం లేక కలెక్టర్‌ను కలిసేందుకు మంగళవారం అక్షయ తన తల్లితోపాటు కలెక్టరేట్‌కు వచ్చి తన గోడును వెల్లబోసుకుంది. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేశారు.