స్కూటీ బ్రెకులు ఫెయిల్‌.. గుట్టపై నుంచి అదుపు తప్పి.. | Woman falls In Deep Valley In Adilabad | Sakshi
Sakshi News home page

స్కూటీ బ్రెకులు ఫెయిల్‌.. లోయలో పడిన మహిళ..

Jul 22 2021 1:07 PM | Updated on Jul 22 2021 1:07 PM

Woman falls In Deep Valley In Adilabad - Sakshi

సాక్షి, తిర్యాణి(ఆదిలాబాద్‌): మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి బాయి జైనూర్‌కు వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా పంగిడిమాదర గుట్ట వద్ద తన స్కూటీ బ్రెకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి గుట్ట పై నుంచి లోయలోకి పడిపోయింది.

దీంతో పార్వతి బాయి స్పృహ తప్పిపోయింది. అటుగా వెళ్తున్న కొందరు యువకులు గుర్తించి స్కూటీతోపాటు ఆమెను రోడ్డు పైకి తీసుకొచ్చి ఇంటికి పంపించారు. అదృష్టవశాత్తు ఎటువంటి త్రీవ గాయాలు కాలేదు. తానను కాపాడిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement