జిల్లాలో తగ్గిన వినాయకుడి మండపాలు

Vinayaka Chavithi Celebrations In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ : జిల్లావ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు శనివారం ఆరంభమయ్యాయి. కరోనా నిబంధనల కారణంగా గతంతో పోలిస్తే ఈసారి సందడి కనిపించడలేదు. చాలాచోట్ల మండపాలు ఏర్పాటుచేయకపోగా, ఎక్కువ మంది ఇళ్లలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాగా, హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో మహాగణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ  ఆధ్వర్యాన పూజలు చేయగా, వేదికపై విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ – రేవతి దంపతులు ప్రారంభించారు. ఆ తర్వాత మూషిక వాహనసేవలో చీఫ్‌ విప్‌తో పాటు గ్రేటర్‌ డిప్యూటీ మేయర్‌ సిరాజుదీ్దన్, ఈఓ పనతుల వేణుగోపాల్, అర్చకులు మణికంశర్మ, ప్రణవ్, నాయకులు పులి రజనీకాంత్, గండ్రాతి రాజు పాల్గొన్నారు. ఇక మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కాగా, తొలిరోజు గణపతిని హరిద్రాగణపతిగా అలంకరించగా, రెండో రోజైన ఆదివారం ద్విముఖ గణపతిగా అలంకరించి పూజలు చేయడంతో పాటు ఐరావత వాహనసేవ, పల్లకీసేవ నిర్వహించారు.

భద్రకాళి ఆలయంలో...
హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీగణపతి నవరాత్రయాగం ప్రారంభమయింది. గణపతినవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం ఆయప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన వల్లభగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి ఉపాసకులు అర్చకులు అరవింద్‌శర్మ, వేముగంటి కాళీప్రసాదశర్మ నేతృత్వంలో శ్రీ గణపతి నవరాత్రి యాగాన్ని నిర్వహించారు. చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ – రేవతి దంపతులు పూజల్లో పాల్గొనడంతో పాటు గణపతి ఉత్సవాల నిర్వహణకు రూ.10వేల విరాళం అందజేశారు. 

మల్లన్న ఆలయంలో...
ఐనవోలు : ఐనవోలులోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. అర్చకులు పాతర్లపాటి రవీందర్, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్వేతార్కుడిపై సూర్య కిరణాలు
కాజీపేట: కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామి వారిపై ఆదివారం సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ మేరకు ప్రత్యేక పూజల్లో ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ, గణపతి ఉపాసకులు త్రిగుళ్ల శ్రీనివాస్‌శర్మ, కార్పొరేటర్‌ జక్కుల రమ, రవీందర్‌యాదవ్, మహతి – రాధాకృష్ణ, కళ్యాణి – సాయికృష్ణ, చొక్కరపు శ్రీనివాస్, దేవులపల్లి సదానందం, శనిగరపు రాజ్‌మోహన్, రవి, మణిదీప్, సుధీర్‌ పాల్గొన్నారు.
ఖిలా వరంగల్‌: వరంగల్‌ పెరకవాడలోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ క్యాంప్‌ కార్యాలయంలో విత్తన గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ పూజలో ఎమ్మెల్యే సతీమణి వాణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కరీమాబాద్‌ : వినాయక చవితి సందర్భంగా హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి పూజలు నిర్వహించారు.
హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, వైస్‌ చైర్మన్‌ కుందూరు
వెంకటేశ్వర్‌రె రెడ్డి, డైరెక్టర్‌ అన్నమనేని జగన్మోహన్‌రావు, సీఈఓ ఉషశ్రీ పూజలు చేశారు.
ఖిలా వరంగల్‌ : వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలో భక్త సమాజ్‌ అధ్యక్షుడు నిషాంత్‌ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఝెంబాడి రవీందర్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్, సదానందం, మహ్మద్‌ అయూబ్‌ దర్శించుకున్నారు.
వరంగల్‌: వరంగల్‌లో 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఝెలగం లీలావతి పసుపుతో వినాయక ప్రతిమ తయారుచేసి పూజలు చేశారు.
కాజీపేట అర్బన్‌ : హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలో అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేష్‌కుమార్‌ ఆధ్వర్యాన లక్ష్మీగణపతిని సిద్దిబుద్ధి సమేత వరసిద్ది వినాయకుడిగా అలంకరించి పూజలు చేశారు.
వరంగల్‌ లీగల్‌ : కరోనా నిబంధనల కారణంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు.
కాజీపేట: కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ముస్లింలైన నిర్వాహకులు ఎం.డీ.యాకూబీ  – చోటు సమాజ కట్టుబాట్లను పక్కన బెట్టి వృద్ధులతో కలిసి పూజలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top