జవాన్‌కు జన్మ‘భూమి’!

Villagers Offered Hundred Yard Space And Showed Respect To Soldiers - Sakshi

స్వగ్రామంలో వంద గజాల స్థలం కేటాయింపు

గౌరవించుకున్న సింగన్నగూడ గ్రామస్తులు

ములుగు(గజ్వేల్‌): దేశరక్షణకు అంకితమైన ఆ సైనికుడికి ఇంటి స్థలం లేదు. ఆ విషయాన్ని స్వగ్రామం గుర్తించింది. వంద గజాల స్థలాన్ని అందజేసి ఆ సైనికుడిపై తమ గౌరవాన్ని చాటుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడ గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్‌ సైనికుడిగా జమ్ముకశ్మీర్‌లో సేవలందిస్తున్నాడు. అతనికి స్వగ్రామంలో ఇంటి స్థలం లేదు.

దీంతో గ్రామస్తులు రామాలయం వెనుక ప్రాంతంలో గ్రామకంఠానికి చెందిన సుమారు రూ.6 లక్షల విలువైన వంద గజాల స్థలాన్ని వెంకటేశ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పంచాయతీ, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అతని పేరిట స్థలం హక్కు పత్రాన్ని రాసి అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి, ఎస్‌ఐ రంగకృష్ణ, సర్పంచ్‌ బాలకృష్ణ, ఉపసర్పంచ్‌ స్వామిగౌడ్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top