హంగామా సృష్టించిన రాజన్న కోడె.. మేడ, రేకుల షెడ్డు, తడకలపైకి ఎక్కి | Vemulawada: Rajanna Temple Bull Falls Off EO Buildings Top Floor | Sakshi
Sakshi News home page

హంగామా సృష్టించిన రాజన్న కోడె.. మేడ, రేకుల షెడ్డు, తడకలపైకి ఎక్కి

Feb 10 2022 8:30 PM | Updated on Feb 10 2022 8:58 PM

Vemulawada: Rajanna Temple Bull Falls Off EO Buildings Top Floor - Sakshi

సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న కోడె బుధవారం హంగామా సృష్టించింది. స్వామి వారి అభిషేక మంటపంలోని గేటు తీసి ఉండటంతో ఓ కోడె మేడపైకి ఎక్కింది. గమనించిన సిబ్బంది దాన్ని కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో జనాల్ని చూసి బెదిరిపోయింది. కోటిలింగాల ప్రాకారమంతా కలియ తిరిగింది. కోటిలింగాల ప్రాకారం పక్కనే హైటెన్షన్‌ వైర్లు ఉండడంతో ఆలయ సిబ్బంది భయపడిపోయారు.

మెల్లిగా కోడెను ఉత్తర ద్వారం వైపు వచ్చేలా చేయడంతో శీఘ్రదర్శనం క్యూలైన్లపై వేసిన రేకులషెడ్డుపై దూకింది. అక్కడి నుంచి జారి చలవపందిళ్లపైకి వచ్చి పడింది. ఇటీవల వేసిన చలవ పందిళ్లు కాస్త బలంగా ఉండటంతో కర్రలపై ఆగిపోయింది. గమనించిన ఆలయ సిబ్బంది ట్రాక్టర్‌ను చలవ పందిళ్ల కిందకు తీసుకొచ్చి కర్రలకున్న తాళ్లను తెంపేశారు. దీంతో ఆ కోడె సురక్షితంగా ట్రాక్టర్‌లోకి దిగింది. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement