బస్సులో కోడిపుంజుకు ఫుల్​ టికెట్​.. అసలేం జరిగిందో చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

TSRTC MD Sajjanar Reacts On Cock Bus Ticket Incident Viral - Sakshi

ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్.. అదీ ఫుల్​ టికెట్​​ కొట్టిన ఘటన సోషల్​ మీడియా ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెట్​లో సెటైర్లు పేలుతున్నాయి. అలా విషయం తన దాకా రావడంతో  టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్​ అయ్యారు. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తోంది. దారిలో రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు. కూడా ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని వెళ్తున్నాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం టికెట్​ ద్వారా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. 

ఏం జరిగిందంటే.. 
ఈ ఘటనలో ఏం జరిగిందో టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. బస్సుల్లో పశుపక్ష్యాదులకు అనుమతి లేదు. సుల్తాన్​బాద్​ దగ్గర కోడిపుంజును గుర్తించాక కండక్టర్​ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్​ అనే ఓ న్యూస్​ రిపోర్టర్.. కండక్టర్​ను టికెట్​ కొట్టమని​ వుసిగొల్పాడట. హాట్​ న్యూస్​ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించగా..  కండక్టర్​ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్​ ఆ రిపోర్టర్ చెప్పినట్లు..​ అలా ప్రవర్తించాల్సింది కాదు. కండక్టర్​ మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన ఓ పోస్ట్​ చేశారు.  ఇదిలా ఉండగా.. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్‌ వెంకటేశం చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించగా.. ట్విటర్​లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్త: పదేళ్లు కూడా బతకని కోడికి ఫుల్​ టికెట్​??

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top