తెలంగాణ గ్రూప్‌-1 కొత్త  నోటిఫికేషన్‌ విడుదల | TSPSC Releases Group-I Notification For 563 Job Vacancies In Telangana- Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రూప్‌-1 కొత్త  నోటిఫికేషన్‌ విడుదల

Published Mon, Feb 19 2024 7:20 PM

TSPSC Released New Group-1 Notification In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 563 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్‌ను  విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 

మళ్లీ అభ్యర్థులుందరూ.. కొత్త నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో  మెయిన్స్‌ పరీక్ష జరగునున్నట్లు తెలుస్తోంది. ఇక.. అభ్యర్థుల వయోపరిమితిని తెలంగాణ ప్రభుత్వం 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.

చదవండి: తెలంగాణ పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు

Advertisement
 
Advertisement