తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు

Published Mon, Feb 19 2024 4:48 PM

TSPSC Group 1 Exam cancelled In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు అయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.  2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక.. త్వరలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

గ్రూప్‌-1కు సంబంధించి పూర్తి వివరాలపై కమిషన్‌ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్‌ వెల్లడించింది. ఇక.. రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement