తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల | TS ICET Results 2020 Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

Nov 2 2020 4:09 PM | Updated on Nov 2 2020 5:31 PM

TS ICET Results 2020 Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. సెప్టెంబర్‌ 30, అక్టోంబర్‌ 1న నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు 45,975మంది హాజరు కాగా, 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పాపిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement