breaking news
telangana icet
-
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 30, అక్టోంబర్ 1న నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 45,975మంది హాజరు కాగా, 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
నేటి నుంచి తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్
-
టీఎస్ ఐసెట్ -2015 ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్ ఐసెట్-2015 ప్రారంభమైంది. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటయించారు. ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పది గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసెట్‌కు సంబంధించి మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. . శుక్రవారం ఉదయం 6గంటలకు ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను కేయూ ఇన్చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు. icet - 2015, telangana icet, MBA,t.papireddy, ఐసెట్ 2015, తెలంగాణ, విద్యార్థులు, ఎంబీఏ