Telangana Land Values: ఆ 5,925 ప్రాంతాలు.. విలువల మధ్య భారీ వ్యత్యాసం

TS Govt Released Land Values Huge Difference Compare Market Rates - Sakshi

ఖాళీ స్థలాల ప్రభుత్వ విలువలకు, మార్కెట్‌ రేట్ల మధ్య భారీ వ్యత్యాసం

13 రెట్ల నుంచి మూడింతల వరకు తేడా ఉందని గుర్తించిన రిజిస్ట్రేషన్ల శాఖ

భారీ తేడాలున్న చోట్ల ఎక్కువగానే విలువల సవరణ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువలకు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముతున్న ధరలకు పొంతనే లేదని తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరిపిన పరిశీలనలో ఐదు జిల్లాల్లోని 5,925 ప్రాంతాల్లో ఈ రెండు విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. ఆ శాఖ ఉన్నతాధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ రెండు విలువల మధ్య కనీసం మూడింతల నుంచి 13 రెట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది.

దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువల సవరణను భారీగానే ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అమ్మకపు విలువకు చాలా తక్కువగానే ప్రభుత్వ విలువను సవరించినా ప్రస్తుతమున్న విలువకు రెట్టింపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల విలువల్లో కూడా రెండింతల వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ విలువలను ప్రతిపాదించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top