TS: Deepavali Bonus To Singareni Employees, Check Full Details Inside - Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి బోనస్‌ ప్రకటన

Oct 13 2022 6:24 PM | Updated on Oct 13 2022 7:20 PM

TS: Deepavali Bonus To Singareni Employees, Check Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనస్‌ అందించనుంది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ. 76,500 బోనస్‌ అందనుంది. ఈ మొత్తం ఈనెల 21న వారి ఖాతాల్లో జమ కానుంది. 

ఇదిలా ఉండగా సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్‌ అందుకు అదనం. దసరా, దీపావళి బోనస్‌లకు చెల్లింపునకు సింగరేణి రూ. 379 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్‌ కింద ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున లక్షా 15 వేల వరకూ రానున్నాయి.
చదవండి: మునుగోడు దంగల్‌.. మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement