బలవంతంగా కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌.. ఆపై | Travel Agent Sold Hyderabad Woman To Dubai Sheik | Sakshi
Sakshi News home page

యువతిని దుబాయ్‌ షేక్‌కు అమ్మేసిన ఏజెంట్‌

Published Wed, Jan 6 2021 11:56 AM | Last Updated on Thu, Jan 7 2021 11:48 AM

Travel Agent Sold Hyderabad Woman To Dubai Sheik - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన యువతి ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ మోసానికి బలైపోయింది. దుబాయ్‌ షేక్‌ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది. వివరాలు.. బాధితురాలిని ట్రావెల్‌ ఏజెంట్‌ ఒకరు దుబాయ్‌కు పంపిస్తామని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో రెండు లక్షలు తీసుకుని దుబాయ్‌ షేక్‌కు ఆమెను అమ్మేశాడు. అనంతరం అతడితో బలవంతంగా కాంట్రాక్ట్‌ మ్యారేజీ చేయించాడు. అప్పటి నుంచి దుబాయ్‌ ఆమె‌పై అత్యాచారానికి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. (చదవండి: కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. )

అతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు‌.. మరోచోట తలదాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న షేక్‌.. ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకువచ్చి మళ్లీ హింసించడం ఆరంభించాడు. అతడికి తెలియకుండా తన తల్లికి ఫోన్‌ చేసిన బాధితురాలు‌.. తనను ఎలాగైనా కాపాడాలంటూ వేడుకుంది. ఈ విషయం గురించి మీడియాతో గోడు వెళ్లబోసుకున్న ఆమె తల్లి.. తన కుమార్తెను ఎలాగైనా రక్షించి హైదరాబాద్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement