సంగారెడ్డిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి! | Three Members Drown in Pond Sangareddy District | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!

Oct 9 2026 1:29 PM | Updated on Oct 9 2026 1:31 PM

Three Members Drown in Pond Sangareddy District

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్‌రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు.

కాగా, చెరువులో మునిగిపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: రేవంత్‌ సర్కార్‌కు షాక్‌.. మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఫెయిల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement