ఎండలు పెరిగాయ్‌!

Temperatures have risen in the state - Sakshi

సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చిటపటమంటున్నాయి. వేసవి సీజన్‌ రాకముందే ఎండల తీవ్రత వేగంగా పెరిగింది. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదు కావడంగమనార్హం.

పగటి ఉష్ణోగ్రతలకు తోడుగా రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉషోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 18.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 

ఖమ్మంలో 4 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా.. 
గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదు కాగా... హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. మిగతా కేంద్రాల్లో 2 డిగ్రీల్లోపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణంలో తేమశాతం తగ్గడంతో పగటి పూట ఉక్కపోత పెరిగింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రత మరింత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top