పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ | Sakshi
Sakshi News home page

పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్

Published Mon, Dec 6 2021 9:26 PM

Telugu people Foundation 13th Anniversary on Dec 11 - Sakshi

తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ పిల్లల చదువు కోసం ప్రతి ఏడాది ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ చదువును కొనసాగించాలనే అభిరుచి ఉన్న తెలుగు విద్యార్థుల కోసం అండగా నిలబడుతుంది. గత ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో రూ. 2 కోట్ల డబ్బును పంచినట్లు తెలుగు పీపుల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఏడాది తెలుగు పీపుల్ ఫౌండేషన్ 13వ వార్షికోత్సవాన్ని డిసెంబర్ 11న జరపనున్నట్లు తెలిపింది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రచార కర్తగా ఆర్.పీ పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తెలుగు పీపుల్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల చదువు కోసం వియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.

 
Advertisement
 
Advertisement