
దేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా (Forbes India) విడుదల చేసింది. ఊహించినట్టుగానే ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రూ .9.32 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.
ఆరుగురు తెలుగువారు
ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆరుగురు తెలుగు (Telugu) పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం విశేషం. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి రూ. 88,800 కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు, తెలుగువారిలో అగ్రస్థానాన్ని సంపాదించారు.
మేఘా ఇంజనీరింగ్ అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ ర్యాంకు, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి 86వ స్థానం, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి 89వ ర్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత కె.సతీష్ రెడ్డి 91వ స్థానంలో నిలిచారు.