ఇక ఆన్‌లైన్‌లో యాదాద్రి బ్రేక్‌ దర్శనం టికెట్లు  | Telangana Yadadri Temple Darshan Tickets Available In Online | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్‌లో యాదాద్రి బ్రేక్‌ దర్శనం టికెట్లు 

Nov 25 2022 12:34 AM | Updated on Nov 25 2022 3:10 PM

Telangana Yadadri Temple Darshan Tickets Available In Online - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శనం టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్‌ దర్శనాలకు రూ.300 టికెట్‌ కొనుగోలు చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

http://yadadritemple.telangana.gov.in లో లాగిన్‌ కావాలని ఈవో6 సూచించారు. ఈ వెబ్‌సైట్‌లో ఉఈ్చటటజ్చిnకు వెళ్లి బ్రేక్‌ దర్శనం రూ.300 అన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి టికెట్‌ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement