TS SSC Result 2023 Live: Check Here Telangana 10th Class Results 2023 On May 10 - Sakshi
Sakshi News home page

TS SSC Results 2023: బుధవారం టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు విడుదల

May 9 2023 10:55 AM | Updated on May 10 2023 11:49 AM

Telangana Tenth Class Results Release On May 10 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టెన్త్ ఫలితాలు బుధవారం(మే 10) విడుదల కానున్నాయి. 12 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నేడు(మంగళవారం) ఇంటర్‌ ఫలితాలను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్‌ ఫలితాలు రిలీజ్‌ కానుండడం విశేషం.

కాగా ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ రాష్ట్రంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. వికారాబాద్‌ తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రం, హన్మకొండ  జిల్లాలోని కమలాపూర్‌లో హిందీ పేపర్ లీకైందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా నడిచింది. అంతేగాక హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై  వరంగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక పరీక్ష పత్రాల లీక్‌ నేపథ్యంలో పేపర్ల వాల్యూయేషన్‌ను అధికారులు జాగ్రత్తగా నిర్వహించారు. 

TS Inter Results 2023: ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement