tenth class result
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
TS SSC Results 2023: బుధవారం టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్త్ ఫలితాలు బుధవారం(మే 10) విడుదల కానున్నాయి. 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకు విద్యాశాఖ, ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నేడు(మంగళవారం) ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం. కాగా ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ రాష్ట్రంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. వికారాబాద్ తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రం, హన్మకొండ జిల్లాలోని కమలాపూర్‌లో హిందీ పేపర్ లీకైందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అంతేగాక హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వరంగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక పరీక్ష పత్రాల లీక్ నేపథ్యంలో పేపర్ల వాల్యూయేషన్‌ను అధికారులు జాగ్రత్తగా నిర్వహించారు. TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. -
వంద శాతం సాధిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి పరీక్షల్లో ‘వంద శాతం ఫలితాలే లక్ష్యం’.. అదే ‘మా నినాదం’ అంటోంది జిల్లా విద్యాశాఖ యంత్రాంగం. టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తూ.. తదుపరి చర్యల్లో బీజీ అవుతోంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలలు పదోతరగతి వార్షిక పరీక్షల్లో 72 శాతం ఫలితాలు సాధించగా.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్టడీ మెటీరియల్ రూపొందించడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ పేర్కొంటున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల్లోనూ నిర్వహించిన ప్రత్యేక తరగతులకు మంచి స్పందన రావడంతో విద్యాశాఖ అధికారులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు.. ప్రత్యేక ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి విద్యార్థి పాస్ కావాల్సిందే.. జిల్లాలో 436 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 24వేల మంది పదోతరగతి విద్యార్థులున్నారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించాలనేది మా లక్ష్యం. బడిలో 60శాతం హాజరు నిండిన విద్యార్థి తప్పకుండా పాసవుతాడు. ఆమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేశారు. డిసెంబర్ నెలాఖరులో బోధన పూర్తి కావడంతో ఇప్పుడు రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కింది తరగతి విద్యార్థులకు ప్రాథమిక మెళకువలు నేర్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.21లక్షలతో స్టడీ మెటీరియల్ విద్యార్థులు సులభమైన పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను రూపొందించాం. దాదాపు రూ.21 లక్షలు వెచ్చించి ఈ మెటీరియల్‌ను త యారు చేయించాం. మరో రెండుమూడు రోజుల్లో విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాం. ఒక్కో విద్యార్థిపై రూ.92 చొప్పున వెచ్చిస్తున్నాం. హెచ్ఎంలతో ప్రత్యేక సమీక్ష ఈ వారంలో ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లతో కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాఠశాలపై చర్చిస్తాం. పురోగతిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా పునఃశ్చరణ తరగతులు నిర్వహించేందుకు కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. 6,7,8,9 తరగతుల విద్యార్థుల బోధన తీరుపైనా సమీక్ష చేస్తాం. క్షేత్రస్థాయి తనిఖీలు విస్తృతం చేస్తాం హెచ్ఎంల మీటింగ్ తర్వాత నేను కూడా విస్తృత తనిఖీలు చేస్తా. అవేవిధంగా జి ల్లాలోని నలుగురు ఉపవిద్యాధికారులకు ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చాం. ప్రతిరో జు క్షేత్ర పర్యటనలు తప్పకుండా చేయా ల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి వారి పరిధిలోని అన్ని పాఠశాలలను క్ర మం తప్పకుండా తనిఖీ చేసి నివేదిక ఇ స్తారు. ఉపాధ్యాయుల బోధన, పిల్లల పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకుగాను ఉప విద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా మండల విద్యాధికారులు కూడా ఉన్నత పాఠశాలల తనిఖీల్లో భాగస్వాములయ్యేలా చూస్తాం.