హైస్కూళ్లలోనే డ్రాపవుట్‌ రేట్‌ ఎక్కువ.. | Telangana Statistical Abstract 2020 Report | Sakshi
Sakshi News home page

148 మందికో బడి.. 

Oct 29 2020 7:58 AM | Updated on Oct 29 2020 7:58 AM

Telangana Statistical Abstract 2020 Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి 148 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రెండు జిల్లాల్లో 300 మందికి పైగా విద్యార్థులకు ఒక పాఠశాల ఉండగా, 7 జిల్లాల్లో ప్రతి 100లోపు విద్యార్థులకు ఒక స్కూల్‌ ఉన్నట్లుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ తాజాగా రూపొందించిన ‘తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2020’లో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 40,597 పాఠశాలలు ఉండగా.. అందులో 20,753 ప్రాథమిక పాఠశాలలు.. 7,356 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 11,847 ఉన్నత పాఠశాలలు, 641 హయ్యర్‌ సెకండరీ స్కూళ్లు ఉన్నట్లు చెప్పింది. మొత్తం స్కూళ్లలో 10,369 ప్రైౖ వేటువి ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల నమోదు, డ్రాపవుట్‌ రేట్‌ తదితర అంశాలను ఆ నివేదికలో పేర్కొంది.  

నివేదికలోని ప్రధాన అంశాలివే..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఆయా జిల్లాల్లో నిర్దేశిత వయసున్న పిల్లల సంఖ్యతో పోల్చితే ప్రాథమిక పాఠశాలల్లో 98.4 శాతం ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 88.1 శాతంగా ఉంది. ఉన్నత పాఠశాలల్లో చేరే వయసున్న వారి సంఖ్యతో పోలి్చతే బడిలో చేరిన విద్యార్థుల సంఖ్య 87.08 శాతంగా నమోదైంది. మూడు జిల్లాల్లో హైసూ్కళ్లలో చేరే వయస్సు ఉన్న విద్యార్థుల సంఖ్యతో పోల్చితే.. 100 శాతానికిపైగా (వలస వచ్చిన వారు) విద్యార్థులు చేరారు.  
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:30 కాగా, ఉన్నత పాఠశాలల్లో 1:35. రాష్ట్రంలో ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు. నాలుగు జిల్లాల్లోని ప్రైమరీ స్కూళ్లలో మాత్రం ఉండాల్సిన టీచర్ల సంఖ్య కంటే తక్కువ మంది ఉన్నారు. ఒక జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో, రెండు జిల్లాల్లోని ఉన్నత పాఠశాలల్లో టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది.  
హైస్కూళ్లలో మధ్యలోనే బడి మానేసిన విద్యార్థుల సంఖ్య (డ్రాపవుట్‌ రేట్‌) ఎక్కువ. ఆరు జిల్లాల్లో 50 శాతానికి పైగా డ్రావుట్‌ రేట్‌ ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 15.76 శాతంగా, ఎలిమెంటరీ పాఠశాలల్లో 29.37 శాతంగా, ఉన్నత పాఠశాలల్లో 34.65 శాతంగా డ్రాపవుట్‌ రేట్‌ ఉంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో–8.01 శాతం, హైదరాబాద్‌లో–0.69 శాతం, రంగారెడ్డిలో–7.12 శాతం డ్రాపవుట్‌ రేట్‌ ఉంది. మేడ్చెల్‌లోని మల్కాజిగిరిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ –5.66 శాతం డ్రాపవుట్‌ రేట్‌ ఉంది. 
రాష్ట్రంలోని స్కూళ్లల్లో 60,15,597 మంది విద్యార్థులు చదువుతుండగా అందులో ఎక్కువ మంది మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నా రు. ఈ లెక్కలన్నీ 2018, సెపె్టంబర్‌ 30 నాటికి(2011 జనాభా లెక్కల ప్రకారం..) ఉన్నవిగా ఆ నివేదికలో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement