ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి

Published Sat, May 25 2024 12:48 AM

Telangana State gets ECI go ahead for state formation day celebrations

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలు

పండుగను తలపించేలా ఏర్పాట్లు 

అధికారులతో సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతిచి్చన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డీజీపీ రవి గుప్తాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బి.వెంకటేశం, జితేందర్, క్రిస్టినా జోంగ్తు, వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, టీజీపీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ఎం.హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

శాంతికుమారి మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రా ఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి పార్కింగ్‌ స్థలాలను కేటాయించాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజలకు ఎండ తగలకుండా బారికేడింగ్‌తో పాటు నీడ కోసం షామియానాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో పారిశు ద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను, నిరంతరాయంగా విద్యు త్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. సీఎం రేవంత్‌గన్‌పార్క్‌ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement