పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు

Telangana SSC Results 2023 Karimnagar Twin Sisters 10 GPA - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే అన్నీ అయి చదివించారు. వాళ్ల శ్రమ వృథా కాలేదు. ఆ కవలలిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో ఎల్రక్టానిక్స్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు. దీంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్‌లో, 6వ తరగతి నుంచి మోడల్‌సూ్కల్‌లో చదివారు. బుధవారం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. ‘అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్‌ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం’ అని శర్వాణి, ప్రజ్ఞాని చెప్పారు.
చదవండి: టెన్త్‌లో 86.60% పాస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top