ఒక్కరోజే 2,387 కరోనా కేసులు | Telangana Reports 2387 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే 2,387 కరోనా కేసులు

Feb 5 2022 3:04 AM | Updated on Feb 5 2022 3:04 AM

Telangana Reports 2387 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 79,567 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,387 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.74 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 4,559 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 7.39 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,097 మంది మృతిచెందారు.

ప్రస్తుతం 30,931 క్రియాశీలక కేసులున్నాయి. వాటిలో 2,761 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 758 మంది ఐసీయూలో.. 1,169 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. మిగి లిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రజారోగ్య సంచా లకుడు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, 15–17 ఏళ్ల వయసు వారి రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ జరుగు తోంది. ఇప్పటివరకు 1,16,383 మందికి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement