Telangana State Government PRC Commission‌ Report Announced - Sakshi
Sakshi News home page

తెలంగాణ పీఆర్సీ కమిషన్‌ రిపోర్టు విడుదల

Jan 27 2021 11:29 AM | Updated on Jan 27 2021 6:14 PM

Telangana PRC Commission Report Released - Sakshi

తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైంది. ఆ రిపోర్టులో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి  సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ. 19 వేలు ఉండాలని, గ‌రిష్ట వేత‌నం 1,62,070 వ‌ర‌కు ఉండొచ్చ‌ని సిఫార‌సు చేసింది.  గ్రాట్యుటీ ప‌రిమితి రూ. 12 ల‌క్ష‌ల నుంచి రూ. 16 ల‌క్ష‌ల‌కు.. శిశు సంర‌క్ష‌ణ సెలవులు 90 నుంచి 120 రోజుల‌కు పెంచింది. ( బంగారు తెలంగాణకు బలమైన పునాదులు )

సీపీఎస్‌లో ప్ర‌భుత్వ వాటా 14 శాతానికి పెంచాల‌ని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేయాల‌ని క‌మిష‌న్ సిఫార్సు చేసింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సాయంత్రం  ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో చర్చలు జరపనుంది. ఈ మేరకు తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు ఆహ్వానం పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement