Telangana Major Railway Stations Developing As International Airports Level - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్‌

Published Fri, Feb 4 2022 4:23 AM

Telangana Major Railway Stations Should Develop The Level Of Airports - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో, విమానా శ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. కేంద్రం గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. ఇండియన్‌ రైల్వేస్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎస్‌ డీసీ)ని ఏర్పాటు చేసినా కార్యరూపంలోకి రాలేదు. ఐఆర్‌ఎస్‌డీసీని రద్దు చేసి ఈ బాధ్యతను రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ)కు అప్పగించినా అడుగు ముందుకు పడలేదు. చివరికి బాధ్య తను జోన్ల అధికారులకు కట్టబెట్టారు. తాజా బడ్జెట్‌లో దక్షిణ మధ్యరైల్వే పరిధిలో స్టేషన్ల అభివృ ద్ధికి రూ.325 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌తోపాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు.

త్వరలోనే టెండర్లు..
సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి కోసం దక్షిణమధ్య రైల్వే త్వరలోనే ఈపీసీ టెండర్లు పిలవనుంది. స్టేషన్‌లో పార్కింగ్‌ మొదలు, రైలు ఎక్కేవరకు అడుగడుగునా అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంలో ఉన్న తరహాలో ఆధునిక ఏర్పాట్లు, షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివీ ఉంటాయి. ఈ మేరకు భవనాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఈ పనులకు నెల రోజుల్లో టెండర్లు పిలిచి, మూడు నెలల్లోపు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ వెంటనే పనులు మొదలుకానున్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement