
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నాంపల్లి, అబిడ్స్,కోఠి, బషీర్భాగ్, ,గోశామహల్ ,మల్లపల్లి,తదితర ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే.. ఉప్పల్ రామంతపూర్ చిలకనగర్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడింది.
ఇదిలా ఉంటే.. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.