కౌంటర్‌ వేయండి.. లేదంటే వివరణ ఇవ్వండి 

Telangana High Court order to HMDA GHMC Over Hussain Sagar Illegal Construction - Sakshi

హుస్సేన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలపై పిల్‌  

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయనే ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయని పక్షంలో ఆగస్టు 23న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వా లని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ల ను ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలీతో కూడిన ధర్మా సనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. హుస్సేన్‌ సాగ ర్‌లోని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్‌ 2020, ఫిబ్రవరిలో చీఫ్‌ జస్టిస్‌కు ఈ–మెయిల్‌ చేశారు.

గోడల నిర్మాణాలు కూడా జరిగాయం టూ ఆమె గూగుల్‌ ఎర్త్‌ నుంచి తీసిన జియో ట్యాగ్‌ చిత్రాన్ని కూడా హైకోర్టుకు పంపారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఆమె ఈ–మెయిల్‌ ఫిర్యాదును హైకోర్టు సుమో టో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top