Telangana High Court Dismisses Actress Sai Pallavi Petition - Sakshi
Sakshi News home page

Sai Pallavi: నటి సాయి పల్లవికి ఊహించని షాకిచ్చిన హైకోర్టు

Jul 7 2022 9:30 PM | Updated on Jul 8 2022 9:01 AM

Telangana High Court Dismisses Actress Sai Pallavi Petition - Sakshi

తెలంగాణ హైకోర్టులో నటి సాయి పల్లవికి ఊహించని షాక్‌ తగిలింది. 

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయి పల్లవికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అయితే, సాయి పల్లవి.. కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటుగా.. గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజ్‌రంగ్‌ దళ్‌సభ్యుడి ఫిర్యాదుతో సుల్తాన్‌ బజార్‌ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 

దీంతో, పోలీసులు.. సాయిపల్లవికి జూన్‌ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇక, 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి:  నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు

Advertisement
 
Advertisement
Advertisement